Sunday, January 19, 2025

NZB | మమ.. అనిపించిన కౌన్సిలింగ్ సమావేశం!

  • వీధి వ్యాపారుల సమస్యపై రచ్చ రచ్చ
  • రసాభాసగా అర్ధాంతరంగా ముగింపు..
  • కాంగ్రెస్, మజిలీస్, బిజెపి కార్పొరేటర్ల నిరసన..
  • ఆందోళన నిరసనలతో దద్దరిల్లిన బల్దియా..

నిజామాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ) : నిజామాబాద్ నగర పాలక సంస్థ చివరి కౌన్సిలింగ్ సమావేశం ఆందోళనలు, నిరసనల మధ్య అర్ధాంతంగా ముగించారు. సమావేశం ప్రారంభానికి ముందు మజ్లిస్ పార్టీ నాయకులు వీధి వ్యాపారుల సమస్య పరిష్కారంపై ఆందోళన చేపట్టారు.

వీధి వ్యాపారుల చిన్న సమస్యపై కౌన్సిలింగ్ సమావేశంలో రచ్చ రచ్చ చేశారు. నగరాభివృద్ధికి సంబంధించిన ఎన్నో అంశాలు ఉన్నా.. అవి పక్కన పెట్టి కేవలం చిన్న సమస్యపై రాద్ధాంతం చేసి అర్ధాంతరంగా ముగించేశారు.

శనివారం నిజామాబాద్ నగరంలోని నగర పాలక సంస్థ కార్యాలయంలో నగర మేయర్ దండు నీతి కిరణ్ అధ్యక్షతన కౌన్సిలింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ, డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్ మున్సిపల్ కమిష నర్ దిలీప్ కుమార్, కార్పొ రేటర్లు, మున్సిపల్ అధికారులు హాజరయ్యారు.

సమావేశములో గత 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్దిని మేయర్ క్లుప్తంగా వివరించారు. సమావేశములో నగర మేయర్ 39 అంశాలను ప్రవేశ పెట్టిన అంశాలు చదువుతున్న క్రమంలో మజిలీస్ పార్టీ నాయకులు అభ్యంతరం తెలుపుతూ వీధి వ్యాపారుల సమస్య పరిష్కారం తర్వాతనే ఎజెండాలోని అంశాలను ఆమోదించాలని పోడియం వద్ద నిరసన చేపట్టారు.

నిబంధనలకు విరుద్ధంగా ఎలా వ్యవహరిస్తారు?

- Advertisement -

రోడ్డుపైన ఎక్కడపడితే అక్కడ వీధి వ్యాపారులు చిరు వ్యాపారుల వల్ల తీవ్ర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ చెప్పారు. ట్రాఫిక్ కు కూడా తీవ్ర అంత రాయం ఏర్పడు తుందని తెలిపారు. వీధి వ్యాపారులకు ఒక ప్రత్యామ్నాయ మార్గం చూయించామని అన్నారు.

ప్రత్యామ్నాయ మార్గం చూయిం చకుంటే తప్పు… కానీ చిన్న సమస్యపై ఇంత రాద్ధాంతం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ వీధి వ్యా పారుల సమస్యపై కౌన్సెలింగ్ సభ్యుల అందరి అభిప్రాయం మేరకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి అందులో ప్రజా ప్రతి నిధులను, పలుశాఖ అధి కారులను సభ్యులుగా నియమించి త్వర లోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ ప్రత్యేక కమిటీపై బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఒప్పుకున్నారు. కానీ మజ్లిస్ పార్టీ సభ్యులు ససేమిరా ఒప్పుకోకుండా పోడియం పాయింట్ వద్ద నినాదాలు చేస్తూ ఛాంబర్ బయట నుంచి ఆందోళన చేపట్టారు.

వీధి వ్యాపారులను తొలగించవద్దని ఎజెం డాలో తీర్మానించాలి

నిజామాబాద్ నగరంలోని వీధి వ్యాపారులు చిరు వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మాస్టర్ ప్లాన్ వచ్చేంత వరకు రోడ్డుపై నుంచి తొలగించకుండా ఎజెండాలో తీర్మానించాలని మజిలీస్ పార్టీ కార్పో రేటర్లు డిమాండ్ చేశారు. ఇందుకు బిజెపి , బీఆర్ ఎస్ కార్పోరేటర్లు ఒప్పు కోలేదు. దీంతో మజిలీస్ పార్టీ కార్పోరే టర్లుబయటకు వెళ్లి సమావేశం హాలు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో కౌన్సిలింగ్ సమావేశంలో ఆందోళన నిరసనల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

అర్ధాంతరంగా సమావేశం ముగించడం పై బిజెపి కార్పొరేటర్ల ఆందోళన

కౌన్సెలింగ్ సమావేశంలో ఎజెండాలోని అంశాలు ఆమోదం తెలపకుండానే అభ్యంతరంగా సమావేశాన్ని ఎలా ముగిస్తారని ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, బిజెపి కార్పొ రేటర్లు చాంబర్ బయట బైటాయించి నుంచి నిరసనచేశారు. మేము వీధి వ్యాపారులకు వ్యతిరేకం కాదని వీధి వ్యాపారుల సమస్య పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాల మేరకు సమస్య పరి ష్కారానికి కృషి చేయాలని తెలిపినట్లు తెలిపారు.

కానీ మాస్టర్ ప్లాన్ వచ్చేంతవరకు వీధి వ్యాపారులను తొలగించేది లేదని ఎజెండాలో తీర్మానం చేపట్టాలని మజ్లిస్ వారి డిమాండ్ ని ఖండించారు. రోడ్డుపైన కూరగాయల వ్యాపారం మొదలుకొని చిరు వ్యాపారులు తోపుడుబండ్లతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు.

నగర అభివృద్ధిపై చర్చించాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి.. కానీ చిన్న సమస్యపై ఇంత రాద్ధాంతం చేయడం సిగ్గుచేటు అన్నారు. సభ్యుల ఆమోదం లేకుండా అర్ధాంతరంగా సమావేశం ఎలా ముగిస్తారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.

నగర మెయర్ దండు నీతు కిరణ్

కౌన్సిలింగ్ సమావేశంలో 39 అంశాలను ప్రవేశపెట్టి సభ్యుల ఆమోదంతో ఆమోదించినట్టు నగర మేయర్ దండు నీతి కిరణ్ తెలిపారు. గత 5 సంవ త్సరాల అభివృద్ధిలో భాగస్వాములైన మాజీ ఎమ్మెల్యే బిగాల, గణేష్ గుప్తకి, ఎంపీనగర ఎమ్మె ల్యే ధన్ పాల్ సూర్యనా రాయణ కి, మాజీ ఎమ్మె ల్సిలు, కార్పొ రేటర్లు, అధికారులకు నగర మేయర్ దండు నీతూ కిరణ్, ధన్య వాదాలు తెలిపారు.

వీధి వ్యాపారుల సమస్యపై రచ్చ రచ్చ

రోడ్డుపైనే వ్యాపారం చేసే వీధి వ్యాపారులు చిరు వ్యాపారుల సమస్య పై కౌన్సిలింగ్ సమావేశంలో రసాబసాగా కొనసాగింది. నగర అభివృద్ధికి సంబం ధించిన పలు అంశాలపై చర్చ చేయాల్సినప్పటికీ ఎలాంటి చర్చ జరగకుం డానే సమావేశం ముగిం చడం పై కాంగ్రెస్ కార్పో రేటర్లు మండిపడ్డారు. నగర అభివృద్ధికి సంబం ధించి కార్పోరేటర్లకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఏట్టకేలకు చిన్న సమస్యపై ఆందో ళనలు నిరసన మధ్య కౌన్సిలింగ్ సమావేశాన్ని మమా అనిపించారు.

పోలీస్ భద్రతా మధ్య కౌన్సిల్ సమావేశం

చిట్ట చివరి కౌన్సిలింగ్ సమావేశం లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ భద్ర త మధ్య సమావేశాన్ని నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement