Tuesday, November 26, 2024

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి..

నిజామాబాద్ సిటీ : దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు కే.రామ్మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి ఎస్.మదన్ మోహన్ డిమాండ్ చేశారు. శనివారం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆల్ పెన్షనర్స్&రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గొడుగులతో వినూత్న నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రధానంగా పీఆర్ సీ కాల పరిమితి ముగిసినందున జూన్ 2023 నుండి అమలయ్యే విధంగా కొత్త పీఆర్సి కమిటీ నియమించాలని కోరారు. బకాయి ఉన్న 3 డిఏలను విడుదల చేయాలని, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమును పటిష్ట పరిచి, నగదు రహిత వైద్యాన్ని అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులలో అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈపీఎస్ పెన్షనర్లకు నెలకు రూ.9000/- రూపాయలు చెల్లించాలని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెన్షనర్ల సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సుదర్శన్ రాజు, ఈవీ ఎల్.నారాయణ, ముత్తారం నరసిం హస్వామి, ఎం. జార్జ్, హనుమాన్లు, ప్రసాద్ రావు , లావు వీరయ్య, లక్ష్మీనారా యణ, అందే సాయిలు, బేబీ, మేరీ, అద్దంకి హుషాన్, బాబా గౌడ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement