Saturday, June 29, 2024

NZB: జూనియర్ డాక్టర్ల‌ సమస్యలు పరిష్కరించాలి..

జీజీహెచ్ వద్ద జూనియర్ డాక్టర్ల సమ్మె ..
సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదు…
జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చంద్రకాంత్, ఉపాధ్యక్షులు సురేష్
నిజామాబాద్ ప్రతినిధి, జూన్ 24(ప్రభా న్యూస్) : ప్రభుత్వం జూనియర్ డాక్టర్స్ సమస్యలు పరిష్కరించాలని జూనియర్స్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చంద్రకాంత్, ఉపాధ్యక్షులు సురేష్ డిమాండ్ చేశారు. జూనియర్ డాక్టర్ల సమస్యల పరిష్కారం కోసం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద సమ్మె చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రతి నెలా 10వ తేదీలోగా స్టైపండ్ జమ చేసేలా గ్రీన్‌ చానల్‌ ఏర్పాటు చేయాలన్నారు. సూపర్‌ స్పెషాలిటీ సీనియర్‌ రెసిడెండ్లకు రూ.1.25 లక్షల గౌరవ వేతనం ఇవ్వాలన్నారు.

పదేండ్లు పూర్తయిన నేపథ్యంలో ఎంబీబీఎస్‌ సీట్లలో 15 శాతం ఉమ్మడి కోటాను తెలంగాణ విద్యా ర్థులకే దక్కేలా ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హాస్టల్‌ భవనాలను నిర్మించకపోవటంతో పీజీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలన్నారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో మౌలిక వసతులు మెరుగు పరచాలన్నారు. జూనియర్ డాక్టర్ల సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు జూనియర్ డాక్టర్ల సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement