Saturday, November 30, 2024

NZB | సమాఖ్య గ్రూప్ సంఘాల డబ్బులు బ్యాంకులో హోల్డ్.. సభ్యుల ఆందోళన..

నిజామాబాద్ ప్రతినిధి, అక్టోబర్ 28 (ఆంధ్రప్రభ) : తిరుమల పరస్పర సహాయక సంఘానికి సంబంధించి గ్రూపు సభ్యులు పొదుపు చేసు కున్న డబ్బులకు సంబంధించిన అకౌంట్ ను, బ్యాంకు సిబ్బంది ఎందుకు హోల్డ్ లో పెట్టారో సమాధానం చెప్పాలని గ్రూప్ సంఘాల అధ్యక్షురాలు శశిరేఖ, సంఘాల సభ్యులు ప్రశ్నించారు. మెప్మా శాఖ పరిధిలోని సమైక్య సంఘాల గ్రూప్ సభ్యులకు సంబంధించి బ్యాంకులో ఎలాంటి లావాదేవీలు చేయరాదని గ్రూప్ సంఘాల సభ్యుల డబ్బులను బ్యాంకులో హోల్డ్ లో పెట్టారు.

సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతమ్ నగర్ లోని తిరుమల పరస్పర సహాయక సంఘ సభ్యులు నగరంలోని గోల్ హనుమాన్ వద్ద గల సహాకార బ్యాంక్ ఎదుట ఆందోళన చేపట్టారు. సీఓ లావణ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అనుమతి లేకుండా ఎలా అకౌంటు హోల్డ్ లో పెట్టారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సమాధానం చెప్పాలని సదరు బ్యాంకు మేనేజర్ ను నిలదీశారు.

సీఓ లావణ్య ప్రమేయంతోనే హోల్డ్ లో పెట్టినట్లు మేనేజర్ చెప్పాడని మహిళలు పేర్కొన్నారు. ఈ విషయమై పీడీకి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని సంఘ సభ్యులు వాపోయారు. పూర్తిగా మెప్మా అవినీతిమయం అయిందని, సీఓ నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరూ అవినీతికి పాల్పడుతున్నట్లు సమాఖ్య సభ్యులు ఆరోపించారు. మెప్మా శాఖలో అసలేం జరుగుతుంది.. జిల్లా కలెక్టర్ ఈ విషయమై వెంటనే స్పందించి త‌మకు న్యాయం చేయాలని వారు కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement