Tuesday, November 26, 2024

శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టుకు పోటెత్తిన వ‌ర‌ద‌..

నిజామబాద్ : ఈసారి తెలంగాణ‌లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిశాయి. ఇప్ప‌టికే ప్రాజెక్టులు నిండుకుండ‌ల‌ను త‌ల‌పిస్తుండ‌డంతో నిన్న కురిసిన భారీ వ‌ర్షం కార‌ణంగా మ‌ళ్లీ ప్రాజెక్టుల‌కు వ‌ర‌ద ప్ర‌వాహం కొన‌సాగుతోంది. నిజామబాద్ జిల్లాలోని శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వ‌చ్చి చేరుతోంది. ఎగువ నుంచి వ‌ర‌ధ ఉధృతి పెరుగుతుండ‌డంతో అధికారులు ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టులోకి 66,340 క్యూసెక్కుల వరద వస్తుండగా, 46,800 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది. ఎస్సార్‌ఎస్పీలో 90.3 టీఎంసీల నీటిని నిల్వచేయవచ్చు. ప్రస్తుతం 90.313 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ఇప్పుడు 1091 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement