వేల్పూర్ (ప్రభ న్యూస్) : ఓ అయిదు సంవత్సరాల బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో కుమ్మరి వాడలో ఉంటున్న రాజారపు శ్రేయస్(5) అనే బాలుడు రోడ్డుపై వెళ్తుంటే వీది కుక్క ఒక్కసారిగా అటాక్ చేసింది.
కుక్క దాడితో తలకు తీవ్రగాయం అయ్యిందని, గమనించిన చుట్టుపక్కలున్న వారు తల్లిదండ్రులకు తెలపడంతో బాలుడిని వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. అలాగే గ్రామంలో వీధికుక్కల బెడద ఎక్కువగా ఉందని, ద్విచక్ర వాహనాల వెంట కూడా పరుగులు పెడుతూ భయందోనలకు గురిచేస్తున్నాయని చాలామంది చెబుతున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి కుక్కల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు.