Tuesday, November 26, 2024

సొసైటీ పై వచ్చిన ఆరోపణలు అవాస్తవం… అధ్యక్షులు స్వామి గౌడ్

నిజామాబాద్ సిటీ, జూలై 3 (ప్రభ న్యూస్): 3వ గౌడ సంఘం సొసైటీపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని తమపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని 3వ పట్టణ గౌడ సంఘం సొసైటీ అధ్యక్షులు స్వామి గౌడ్ తెలిపారు. సోమవారం నిజామాబాద్ నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. 3వ సొసైటీలో 69 మంది ట్యాపర్లు, సుమారు 2వేల సభ్యత్వాలు కలిగి ఉన్నాయన్నారు. 36 రోజుల పాటు నిరాహారదీక్ష చేపట్టి పోరాటం చేస్తేనే సొసైటీ ఏర్పడిందని పేర్కొన్నారు. తమ సొసైటీలో అర్హులైన నిరుపేద గీత కార్మికులకు సభ్యత్వం కలిగి ఉందన్నారు.

బైలా ప్రకారం… అన్ని నిబంధనలు తుచా తప్పకుండా పాటిస్తూ సొసైటీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామన్నారు. పట్టణంలో 12 వేల కుటుంబాలు ఉన్నాయనీ… 350 మంది కుటుంబాలు ఈ సొసైటీ పై ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. కేవలం డబ్బులకు ఆశపడి అనవసరమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సొసైటీలో అవినీతి జరగడానికి ఎలాంటి ఆస్కారం లేదని వెల్లడించారు. కార్మికుల కోసమే ఏర్పడిన సొసైటీ అని తెలిపారు. ఎలాంటి సాక్షాదారాలు లేకుండా మూడవ సొసైటీపై ఆరోపణలను చేసిన వ్యక్తులను క్రమశిక్షణ చర్యలో భాగంగా సొసైటీ నుంచి తొలగించడమే కాకుండా వారిపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సొసైటీ ప్రధాన కార్యదర్శి సుమన్ గౌడ్, రాజా గౌడ్, బోజగౌడ్, నర్శ గౌడ్, సాయ గౌడ్, గీత కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement