Monday, December 16, 2024

TG: నుడా అభివృద్ధికి కృషి చేస్తా… చైర్మన్ కేశ వేణు


నిజామాబాద్ ప్రతినిధి, అక్టోబర్ 11(ప్రభ న్యూస్) : నుడా అభివృద్ధికి కృషి చేస్తానని నుడా చైర్మన్ కేశవేణు అన్నారు. తనపై నమ్మకం ఉంచి ఈ పదవీ బాధ్యతలు అప్పజెప్పినందుకు అధిష్టానానికి, రాష్ట్ర నాయకులకు, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కేశవ వేణుని ప్రభుత్వం నియమించినట్లు ఉత్తర్వులు జారీ చేసారు.

శుక్రవారం హైదరాబాదులో నుడా చైర్మన్ గా కేశ వేణుకు, రాష్ట్ర రథసారథి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మాజీమంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలు నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కేశవేణు శాలువాతో ఘనంగా సన్మానిం చారు. అనంతరం హైదరాబాదులోని గాంధీభవన్ లో రాష్ట్ర రథసారథి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని కేశ వేణు మర్యాదపూర్వకంగా కలసి సన్మానించారు. ఈ సందర్భంగా నుడా చైర్మన్ కేశ వేణు మాట్లాడుతూ… గత కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేశానని చెప్పారు. కష్టపడి పని చేసే వారికి కాంగ్రెస్ పార్టీలో తప్ప కుండా గుర్తింపు ఉంటుదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కృషి చేస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement