Tuesday, November 26, 2024

తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది

రుద్రూర్, ఏప్రిల్ 9(ప్రభన్యూస్ ) : ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తోట సంగయ్య, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ సంజీవులు అన్నారు. ఆదివారం రుద్రూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తోట సంగయ్య, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ సంజీవులు మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలంలో మొట్ట మొదటిసారిగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారని అన్నారు. మిగతా మండలాల్లోని గ్రామాలలో త్వరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలని ప్రారంభిస్తామని తెలిపారు. నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాసుల బాలరాజ్ స్పీకర్ పై, స్పీకర్ కుటుంబం పై లేనిపోని విమర్శలు చేస్తే సహించేది లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని రైతులకు ఎల్లప్పుడూ బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసని, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి అని వారు సవాలు విసిరారు. మరోసారి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పై, వారి కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు తోట్ల గంగారం, సర్పంచుల ఫోరం అధ్యక్షులు షేక్ ఖాదర్, ఎంపీటీసీ లక్ష్మీ గంగారం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మోహన్, కోడె సుభాష్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్, ఇమ్రాన్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement