Friday, November 15, 2024

NZB: ఆ ఇళ్లను కూల్చివేయండి… నోటీసులు

నిజామాబాద్ ప్రతినిధి, సెప్టెంబర్ 2(ప్రభ న్యూస్) : గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన పాత ఇండ్లు వర్షానికి కూలుతున్నాయి. సోమవారం పెద్దబజార్ లో హనుమాన్ ఆలయం ఎదురుగా ఒక్కసారిగా ఇల్లు కుప్ప కూలింది. పక్కనే దుకాణం.. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఉదయం ఇల్లు కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అదేవిధంగా పెద్ద బజారులోని కూలిపోయే దశలో ఉన్న మరో ఇల్లును కూడా గుర్తించి అధికారులు నోటీసులు అతికించారు.

కూలిపోయే దశలో ఉన్న ఇండ్లలో నివశించొద్దు..
గత మూడు రోజులుగా 35 ఇండ్లకు కార్పొరేషన్ నోటీసులు..
కూలిపోయే దశలో ఉన్న ఇండ్లలో ఎట్టి పరిస్థితుల్లో నివశించొద్దని కార్పొరేషన్ అధికారులు సూచిస్తున్నారు. పెద్ద ప్రమాదం జరగకముందే ముందస్తు జాగ్రత్తగా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో కూలిపోయే దశలో ఉన్న ఇండ్లను అధికారులు గుర్తిస్తున్నారు.

ఇందుకు సంబంధించి నగరంలోని దుబ్బ, గాజు ల్పేట్, పవన్ నగర్, అరుంధతి నగర్, ముదిరాజ్ గల్లి బోర్గాం (పి) లలో గత మూడు రోజులుగా మున్సిపల్ కార్పొ రేషన్ అధికారులు 35 ఇండ్లకు నోటీసులు అందజేశారు. ఇందుకు ఇంటి యజమానులు సహకరించాలని కార్పొరేషన్ అధికారులు కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement