Sunday, September 15, 2024

NZB: ఐడీసీఎంఎస్ చైర్మన్ గా తారాచంద్…

అధికార పార్టీ నుంచి ఇద్దరు నామినేషన్ దాఖలు..
ఒకరి విడ్రాతో… ఏకగ్రీవమైన తారాచంద్..

నిజామాబాద్, ప్రతినిధి, ఆగస్టు 5(ప్రభ న్యూస్) : ఇందూరు ఉమ్మడి జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (ఐడీసీఎంఎస్) చైర్మన్ గా తారాచంద్ నాయక్ ఏకగ్రీవ మయ్యాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందూరు ఉమ్మడి జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గా ఉన్న సాంబారు మోహన్ తన పదవికి రాజీమానా చేశారు. ఆ తర్వాత ఇన్చార్జి చైర్మన్ గా ఇంద్రసేనారెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో చైర్మన్ పదవి కోసం ఎన్నికలు నిర్వహించారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని డీసీఎంఎస్ కార్యాలయంలో స్టేట్ కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ ఆదేశాల మేరకు ఎన్నికల అధికారిగా కామారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ రామ్మోహన్ ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు.

ఈ సందర్భంగా చైర్మన్ పదవికి అధికార పార్టీకి చెందిన గాంధారి సొసైటీ చైర్మన్ సాయన్న, రాంపూర్ సొసైటీ చైర్మన్ తారా చంద్ నాయక్ లు ఇద్దరూ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ పీఠం కోసం సొసైటీ కార్యాలయం వద్ద ఎన్నిక రసవత్తరంగా మారింది. ఎట్టకేలకు గాంధారి సాయన్న నామినేషన్ విడ్రా చేయడంతో… తారా చంద్ నాయక్ ను సొసైటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి తారాచంద్ నాయక్ నియామక పత్రాన్ని అందజేశారు. తారాచంద్ అనుచర వర్గం మిఠాయిలు పంచుతూ ఘనంగా సంబురాలు జరిపారు.

అవినీతి అక్రమాలకు తావు లేకుండా సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తా… తారాచంద్ నాయక్
ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానని ఏకగ్రీవంగా ఎన్నికైన తారాచంద్ నాయక్ తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పజెప్పిన కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యాదగిరి, సొసైటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement