నిజామాబాద్ ప్రతినిధి, (ప్రభ న్యూస్) :నిజామాబాద్ నగరంలోని భవానీ గీతా పారిశ్రామిక సహకార సంఘం సొసైటీలో జరుగుతున్న అక్రమాలపై నిగ్గు తేల్చండని.. బహిరంగంగా చర్చించడాని సిద్ధమేనా అని గౌడ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు. ఆదివారం నిజామాబాద్ సుభాష్ నగర్ లోని ఆర్అండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోమూడవ కల్లు సొసైటీకి చెందిన గౌడ కులస్తులతో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…. మూడవ కల్లు సొసైటీలో గీతా కార్మికుల పొట్టను కొట్టి సంఘం బైలాను తుంగలో తొక్కేసి స్వామి గౌడ్ కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించడం జరిగిందని ఆరోపించారు.
హైదరాబాదులో నాలుగు కోట్ల రూపాయల విల్లాను నిజామాబాద్ లో కోటి రూపాయలతో ఇల్లును మూడు కార్లను కొనుగోలు చేశారని డిపో యజమానులుగా చలామణి అవుతున్న మరో ఇద్దరు వ్యక్తులు కోట్ల రూపాయలు ఎక్కడి నుండి సంపాదించారని ప్రశ్నించారు. ఈ ముగ్గురు మాత్రాము నెలకు తల రూ.2 లక్షల వేతనం తీసుకుంటు, కార్మికులకు కేవలం రూ.4వెలు సభ్యులకు నెలకు రూ.1000 ఇస్తూన్నారని చెప్పారు.
ఐదు నెలల నుండి సభ్యులకు ఆ వేయి రూపాయలు కూడా ఇవ్వడం లేదని వాపోయారు. సొసైటీ బైలా ప్రకారం వచ్చిన లాభాలను 15 శాతం వాటాను కార్మికులకు పంచాలి 25 శాతంలాభాలను గీతా కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగించాలన్నారు. సొసైటీ పేరు మీద ఆస్తులు కూడా కట్టాలి సొసైటీ పేరు మీద ఒక్క గజం భూమి కూడా ఒక్క రూపాయి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేకుండా చేసి వచ్చిన లాభాలు అంతా కూడా ఈ ముగ్గురే పంచుకోవడం జరిగిందని ఆరోపించారు.
నగరంలోని మొదటి రెండవ సొసైటీలో సభ్యత్వం లేని గౌడ కులస్తు లను గీత కార్మికుల కోసం గత ప్రభుత్వం మూడవ కల్లు సొసైటీకి అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. అనుమతులు వచ్చిన తర్వాత సొసైటీ కోసం పోరాడిన వ్యక్తులకు కాకుండా స్థానికేతరులైన స్వామిగౌడ్ తన బంధు బలగంతోటి నింపడం జరిగిందని ఆరోపించారు. పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పారు. ఈ ఆధారాలు తప్పయితే బహిరంగంగా చర్చించడానికి తాను సిద్ధమేనని నా ఆరోపణలు తప్పని నిరూపిస్తే ముక్కునేలకు రాస్తానని అన్నారు.
వేరే జిల్లా వారికి ఓటర్ కార్డులు ఆధార్ కార్డులు ఉపాధి హామీ కార్డులు పెన్షన్ కార్డులు కలిగిన వ్యక్తుల వివరాలను అన్ని కూడా మీడియా సమక్షంలో ప్రదర్శిస్తున్నామని చూపెట్టడం జరిగిందన్నారు. ఇంత జరిగినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మామూళ్ల మత్తులో కూడుకపోయి ఉన్నారని ఆరోపించారు. వారి పైన కూడా రాష్ట్రస్థాయి అధికారులకు సైతం ఫిర్యాదు చేయడానికి వెనుకాడమని స్థానికులకు గీతా కార్మికులుగా అవకాశం కల్పించాలని సొసైటీలో స్థిర నివాసం ఉన్నటు వంటి గౌడ కులస్తులకు సభ్యత్వం కల్పించాలని అంతవరకూ పోరాటం ఇదేవిధంగా కొనసాగుతుందన్నారు.
నెల రోజులుగా అక్రమ ఆధార్ కార్డులపై జిల్లా కలెక్టర్ కి, పోలీస్ కమిషనర్ కి ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని ఇంతవరకు విచారణ మాత్రం ముందుకు సాగడం లేదని వాపోయారు. తక్షణమే నూతన కార్మికులకు తీసుకోవాలని, కుల బహి ష్కరణ చేసిన రాజగోపాల్ గౌడ్ ను ఆయ న కల్లు దుకాణం ఆయనకు ఇచ్చి కులం లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గౌడ సంఘం నాయకులు రాజగోపాల్ గౌడ్, సిరిగాథ స్వామి గౌడ్, బాబా గౌడ్, అశోక్ రాజ్ గౌడ్ ,అఖిల్ గౌడ్ రాజ్ కుమార్ గౌడ్ సత్యం గౌడ్ తదితరులు పాల్గొన్నారు