Monday, November 18, 2024

తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి… అరుణతార

బిచ్కుంద, మే 5 ప్రభ న్యూస్ : అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కొనుగోలు చేసి, నష్టపరిహారం చెల్లించాలంటూ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం గుండె నెమలి గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… అకాల వర్షాలతో వడగండ్లు పడి నష్టపోయిన రైతులకు పూర్తి నష్టపరిహారం చెల్లించాలని, లేని యెడల ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైస్ మిల్లు ఎలాంటి తరుగు లేకుండా రైతుల దగ్గర కొనుగోలు చేయాలని, కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసి రైతులను కాపాడాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రైతు ప్రభుత్వం అంటున్న తెలంగాణ రాష్ట్రం గత వారం రోజుల నుండి తడిసిన వరి ధాన్యాన్ని ఇటు అధికారులు, అధికార పార్టీ నాయకులు పట్టించుకోవడంలేదని ఆమె ఆరోపించారు. రైతులను గ్రామీణ ప్రాంతాల్లో తడిసిన ధాన్యాన్ని బిచ్కుంద తాసిల్దార్ వచ్చే వరకు ధర్నాను విరమించేది లేదని పట్టుపట్టారు. దీంతో బిచ్కుంద తాసిల్దార్ ధర్నా నిర్వహిస్తున్న గుండె నెమలి గ్రామంలోకి వచ్చి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో బీజేపీ పార్టీ ధర్నాను విరమించుకున్నారు. రైతులు స్వయాన వచ్చి ధర్నాలో పాల్గొన్న బీజేపీ నాయకులను పంట పొలాల వద్దకు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద బీజేవైఎం యువ మోర్చా మండల అధ్యక్షులు శెట్టిపల్లి విష్ణు, గుండె నెమలి రైతు నవీన్ రెడ్డి, ఐదు మండలాల అధ్యక్షులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement