ఉమ్మడి నిజామాబాద్, ప్రభ న్యూస్ బ్యూరో : శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పరివాహకప్రాంతంలో రెండు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు మంజీరా, గోదావరి నదుల నుంచి కాకుండా గడ్డెన్నవాగు నుంచి భారీగా వరద నీరు వస్తోంది. ఉదయం వరకు 1లక్ష 57వేల274 క్యూసెక్కుల వరద నీరు వచ్చిచేరుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
ప్రాజెక్టు నీటిమట్టం 1091అడుగులకు గాను1087.9 అడుగులకు చేరుకుంది. 80.5 టీఎంసీల సామర్థ్యానికి గాను 60.57 టీఎంసీలకు చేరుకుంది. భారీగా ఇన్ ఫ్లో రావడంతో మరో కొన్ని గంటల్లో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోనుంది.
- Advertisement -
ప్రాజెక్టులోకి వస్తున్న వరద ఉదృతి అంచనా వేస్తున్న అధికారులు మరికొన్ని గంటల్లో ఎప్పుడైనా గేట్లు ఎత్తి నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేయనున్నారు.