నిజామాబాద్ ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : పీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేరుతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి విజయవంతం చేయడం అభినందనీయమని అడిషనల్ డిసిపి బసవరెడ్డి రేడ్డి అన్నారు. ఈ నెల 3 నుంచి 20వరకు పీసీసీ ఛీఫ్ మహే ష్‌కుమార్ క్రికెట్‌కప్ టోర్న మెంట్‌ను ఆర్గనైజర్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంగా నిర్వహించగా ముగింపు శుక్రవారం పాలిటేక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా అడిషనల్ డిసిపి బసవరెడ్డి, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్‌లు హాజరైనారు.
ఈ సందర్బంగా అడిషనల్ డిసిపి మాట్లాడుతూ, ఆటల పోటీల్లో కులాలకు, మతాలకు తావివ్వకుండా అందరు స్నేహాపూర్వకంగా ఆడడం చాలా సంతోషంగా ఉంద న్నారు. ఇదే విదానాన్ని కొన సాగించాలన్నారు. ముఖ్యంగా క్రికెట్‌కు చాలా ఆదరణ ఉందని, ఆడినా, ఓడినా రెండు సమానంగా తీసుకోవాలన్నారు. ఆటలో గెలుపు, ఓటములు సహజమని అన్నారు.
క్రీడా స్పూర్తి చాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు నచ్చిన క్రీడలో సాధన చేయాలన్నారు. గత 18 రోజులుగా జిల్లాలో పెద్ద ఎత్తున క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించగా ఉమ్మడి జిల్లాలోని జిల్లాలోని నలుమూలల నుంచి క్రిడా కారులు పాల్గొని ప్రాతినిత్యం వహించారు. విజేత, రన్నర్‌లకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
జిల్లా నుంచి ఉన్నతంగా ఎదిగేలా క్రికెట్‌లో రాణించాలి
జిల్లా నుంచి ఉన్నతంగా ఎదిగేలా క్రికెట్‌లో రాణిం చాలని రైతు కమిషన్ సభ్యు లు గడుగు గంగాధర్ అన్నారు. ప్రతినిత్యం ప్రాక్టీసు చేసి ఉన్నతాశిఖారాలను అధిరోహించాలన్నారు. వచ్చిన అవకాశాలను సద్వి నియోగం చేసుకోవాలన్నారు. అనంతరం విన్నర్, రన్నర్ లకు ట్రోఫిలు, నగదు ప్రోత్స హాకాలు అందజేశారు. విజేతగా ఆరెంజ్ ఆర్మీ(రూ. 25వేలు నగదు)ట్రోపి అందజేసారు. రన్నర్‌గా నిజామాబాద్‌స్టార్(రూ. 15వేల నగదు) ట్రోపి అందజేత.
ఈ కార్యక్రమంలోటీ పిసిసి రాష్ట్ర లీగల్‌సెల్ ఉపాధ్యక్షులు దయాకర్‌గౌడ్, రాష్ట్ర నాయ కులు రత్నాకర్, టోర్ని ఆర్గనైజర్ శ్రీనివాస్‌గౌడ్, ఎర్రం గంగాధర్, ఖుద్దుస్, శ్యామ్, తదివతరులు పాల్గొన్నారు.