Saturday, June 29, 2024

NZB | శుభం కరోతి ఆలయంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు…

నిజామాబాద్ ప్రతినిధి (ప్రభా న్యూస్) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శుభం కరోటి ఆలయంలో సంకటహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. గణేశుడి దర్శనం కోసం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలోని శుభం కరోటి ఆలయంలో ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు. ఆలయ అర్చకులు భక్తుల ఆధ్వర్యంలో గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు.

- Advertisement -

మంగళవారం సాయంత్రం సంకటహర చతుర్ధిని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి హాజరయ్యారు. ఆలయంలో భజన బృందం ఆలపించిన కీర్తనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం దాతల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శుభం కరోటి ఆలయ కమిటీ సభ్యులు, సేవకులు, దాతలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement