Friday, November 22, 2024

సేవాలాల్ మహారాజ్ అందరికీ ఆదర్శప్రాయులు – సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి

నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండలంలోని సేవాలాల్ మహారాజ్ ఆలయంలో గిరిజనులు తమ ఆరాధ్య దైవంగా భావించే జగదాంబ దేవి సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి వేడుకలను గిరిజన సోదరులు పండుగ వాతావరణం లో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన సతీమణి, వారి పుత్రులు సహకార బ్యాంకు అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డి లు పాల్గొని పూజా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.

ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ,సంత్ శ్రీ శ్రీ శ్రీ మహారాజ్ సమాజానికి ఆదర్శప్రాయులని ఆయన గిరిజన కుటుంబంలో జన్మించినప్పటికీ సమాజానికే ఆదర్శప్రాయాలని వారి బోధనలు సమాజానికి ఆదర్శమని ప్రతి ఒక్కరూ ఆచరించాలని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుతో సేవాలాల్ మహారాజ్ ఒక గుర్తింపు ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. కారణజన్ములు కొందరే ఉంటారని వారిలో సేవాలాల్ మహారాజ్ ఒకరని గుర్తు గుర్తు చేశారు. ప్రతి ఒక్కరు సేవాలాల్ మహారాజు బాటలో నడిచి ఇతరులకు ఆదర్శప్రాయులుగా నిలవాలని సభాపతి సూచించారు. 2001లో ఉమ్మడి రాష్ట్రంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో సేవాలాల్ మహారాజ్ ఆలయానికి వెళ్లే రహదారికి కోటి రూపాయల నిధులు ఆనాడు మంజూరు చేశానని గుర్తు చేశారు. సేవాలాల్ మహారాజ్ చేసిన సేవలు గుర్తు చేసుకోవడంలో మనలో కూడా పరివర్తన కలుగుతుందని భక్తులకు తన సందేశాన్ని సభాపతి అందజేశారు. సేవాలాల్ మహారాజు సూక్తులను సభాపతి చదివి వినిపించడంతో చూపర్లను ఆకట్టుకున్నారు.

v

పోడు భూములకు పరిష్కారం చూపిస్తాం.
రాష్ట్రంలోని గిరిజనులు పోడు భూముల సాగు విషయాన్ని ప్రభుత్వం ఆలోచన చేస్తుందని వారికి పరిష్కార మార్గాన్ని కెసిఆర్ చూపిస్తారని సభాపతి భరోసా ఇచ్చారు. బాన్స్వాడ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున గిరిజన కుటుంబాలు పోడు భూముల వ్యవసాయాన్ని ఎన్నో ఏళ్లుగా చేపడుతున్న విషయం తన దృష్టిలో ఉందని తాను అధికారుల ద్వారా సర్వే జరిపి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లానని గిరిజన సమస్యను పరిష్కరించి తీరుతామని సభాపతి తెలిపారు. ఆయన వెంట బోధన్ ఆర్డిఓ రాజేశ్వర్, స్థానిక తహసిల్దార్ విటల్, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement