Tuesday, November 26, 2024

NZB | షబ్బీర్ అలీని భారీ మెజారిటీతో గెలిపించాలి : విజయశాంతి

నిజామాబాద్ సిటీ నవంబర్ ( ప్రభ న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలో కాల్ మొక్కుతా బాంచన్.. ఇంకెన్నాళ్లు ఈ బానిస బతుకులు. ప్రజల్లో మార్పు రావాలి కేసిఆర్ కుటుంబ పాలనను భూస్థాపితం చేయాలని మాజీ ఎంపీ, కాంగ్రె స్‌ నాయకురాలు విజయశాంతి అన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో కేసిఆర్ రూ.10 లక్షల కోట్లు దోచుకోని… టాటాబిర్లా కంటే ఎక్కువ ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. తెలంగాణలో కమిషన్ల వచ్చే పనులు మాత్రమే కేసీఆర్‌ పనులను చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు అవసర మైన పనులను చేయడం లేదని అందుకే తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ను బొంద పెట్టాలని పిలుపునిచ్చారు.

నగరంలోని దుబ్బా చౌరస్తాలో నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్‌ కార్నర్‌ మీటింగ్‌ కార్యక్రమానికి మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి ముఖ్యఅతిథిగా హాజరయ్యా రూ. దుబ్బా చౌరస్తా సభా ప్రాంగణమంతా రాములమ్మని చూడడానికి యువకులు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ అభివృద్ధి సంక్షేమం పేరిట కోట్ల రూపాయ లు దండుకున్నారని ఆరోపించారు.

- Advertisement -

బీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టి కేసీఆర్‌ పైసలతో దేశంలో ఉన్న ప్రతిపక్షాలను కోనుగోలు చేసి రాజకీయాలు చేయాలని చూశాడని వారు నమ్మలేదన్నారు. కాలేశ్వరంకు 80 వేల కోట్లు పెట్టిన కమిషన్లతో నాణ్యత లేకపోవడంతో మేడిగడ్డ ప్రాజెక్ట్‌ ఫిలర్లు క్రుంగిపోయినట్లు తెలిపారు. రూ.1600 కోట్లతో సచివాలయం నిర్మిం చిన అక్కడికి ప్రజలను ఎందుకులోనికి వెళ్లనీయడం లేదన్నారు. కేసీఆర్‌ అక్కడ ఉండి హైదరాబాద్‌ను రాజ్యం ఎలాలని చూస్తున్నారని తెలిపారు. తెలంగాణ బిల్లు పెట్టే సమయంలో కేసీఆర్‌ పార్లమెంట్‌ నుంచి పారిపోయాడని చెప్పారు. పార్లమెంట్‌లో స్పీకర్‌ బిల్లు పెట్టి పాస్‌ అయ్యే వరకు అక్కడ ఉన్నట్లు చెప్పారు.

తెలంగాణ యువకుల బలిదా నాలపై బీఆర్‌ఎస్‌ అధికారం లోకి వచ్చిందన్నారు. యువ తకు ఉద్యోగాలు కల్పించక పోవడంతో ఆత్మహత్యలు చేసుకున్నారని, పదవులు పోతే కేసీఆర్‌ కటుంబంకు వెంటనే వస్తాయని తెలిపారు. బీఆర్‌ ఎస్‌ పై బీజెపీ రాష్ట్రనాయ కత్వం పోరాటాలు చేసిందని, కేంద్రంతో బీఆర్‌ఎస్‌తో చీకటి ఒప్పందం ఉండటంతోనే లిక్కర్‌ కేసు, ప్రభుత్వ అవినీతిపై విచారణ జరపకుండా ఢీల్లీ పెద్దలు అడ్డుకున్నారని ఆరోపిం చారు. నిజామాబాద్‌ అర్బన్‌ ప్రజలు కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ఆలీని గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో మార్పు రావాలని అవకాశం వచ్చింది.. ఒక్క ఓటుతో కేసీఆర్ ను గద్దె దించాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement