నిజామాబాద్ మాజీ ఎంపీ డి.శ్రీనివాస్‌కు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. యూరినరీ ఇన్ఫెక్షన్‌తో హైదారాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో చేర్చినట్టు సమాచారం. తండ్రి అనారోగ్యం విషయాన్ని ఎంపీ అర్వింద్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మా నాన్న డి. శ్రీనివాస్ తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు.ప్రస్తుతం డీఎస్‌కు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారని వెల్లడించారు.
కాగా, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా కొనసాగిన డీ శ్రీనివాస్.. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగానూ పనిచేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే.. కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. రాజకీయాల్లో ప్రస్తుతం ఆయన క్రియాశీలంగా లేరు. దీనికి ఆయన ఆరోగ్య సమస్యలే కారణంగా తెలుస్తోంది.