నిజామాబాద్ ప్రతినిధి, నవంబర్19: (ఆంధ్రప్రభ) : సర్వేంద్రియానాం నయనం ప్రధానమని, నేత్రాల పరిరక్షనే ప్రధానమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల కోరారు. బుధవారం నిజామాబాద్ బార్ అసోసియేషన్ సౌజన్యంతో డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలోని కంటి వైద్య శిబిరం నిర్వహించారు. బార్ అసోసియేషన్ సమావేశపు హల్ లో కంటి వైద్య శిబిరాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడారు. మానవ శరీరంలో కళ్ళు ప్రధాన అవయవాలని, కంటి చూపుతో విశ్వాన్ని దర్శించవచ్చని ఆమె తెలిపారు.
మనిషి మరణానంతరం నేత్రాలను మరో మనిషికి దానం చేసే గొప్ప అవయవంగా వైద్య పరిభాషలో పేర్కొంటున్న విషయాన్ని గుర్తు చేశారు. నేత్రధానం వలన మరికొందరు ప్రపంచాన్ని చూడగలుగుతున్నారన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ సామాజిక దృక్పథంతో వైద్యారోగ్య శిబిరం నిర్వహించడాన్ని జిల్లా జడ్జి ప్రశంసించారు. బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. కోర్టు సిబ్బంది, న్యాయవాదులు పని ఒత్తిడికి లోనవుతారని దాని వలన కళ్లపైన ప్రభావం పడుతుందన్నారు. కంప్యూటర్లు, సెల్ ఫోన్స్, ల్యాప్ ట్యాప్, ట్యాబ్ ల వినియోగం వలన నేత్రాలు రకరకాల అనారోగ్య సమస్యల పాలవుతున్నాయని, దీనిని అధిగమించడానికి కంటి వైద్యపరీక్షలు చేసుకోవాలన్నారు.
డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి డాక్టర్ శరత్ జోషి ఆస్పత్రి అప్తమలిస్ట్ విభవ్ చరణ్ గౌడ్ గణేష్ సంజయ్ లు న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి, కక్షిదారులకు కంటి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు రాజు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్ రెడ్డి, ఇంచార్జీ గవర్నమెంట్ ప్లీడర్ వెంకట రమణ గౌడ్, న్యాయవాదులు ఎం.లక్ష్మణ్, కవిత రెడ్డి, అంజలి, రజిత, అరెటి నారాయణ రాణదేశ్ మానిక్ రాజు, విగ్నేష్, చింతకుంట సాయిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.