Friday, November 15, 2024

సీఎం కేసీఆర్ అండతో ఆర్టీసీ నష్టాలు తగ్గించాం : ఆర్టీసీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి…

సిరికొండ, ఫిబ్రవరి 25 ( ప్రభన్యూస్ ): తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ అండతో నష్టాల్లో కురుకుపోయిన టిఎస్ ఆర్టీసీ సంస్థను గత సంవత్సర కాలంలో 5 కోట్ల నుంచి 2.50 కోట్ల వరకు తగ్గించామని టిఎస్ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు. నిజామాబాదు జిల్లా సిరికొండ మండలం చీమన్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ భూమి పూజలో పాల్గొన్న అనంతరం గోవర్ధన్ మాట్లాడుతూ, తాను ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తయ్యింది. ఈ సంవత్సర కాలంలో ఆర్టీసీ మనుగడ కోసం తీసుకున్న చర్యలు నాకు సంతృప్తిని ఇచ్చాయని అయన అన్నారు.
ఆర్టీసీ చైర్మన్ గా తనను నియమిస్తు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న అనంతరం. చాలా మంది తన విధేయులు తనతో మాట్లాడుతు. మీరు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు. మీకు సీఎంతో మంత్రి పదవి గురించి మాట్లాడండి. ఆర్టీసీ చైర్మన్ పదవి తీసుకోవడం ఎందుకని ప్రశ్నించారు. కాని ముఖ్యమంత్రి కేసీఆర్ దూర దృష్టితో అలోచించి నిర్ణయం తీసుకుంటారు. అందు వల్ల సీఎం ఆదేశాలను గౌరవించి ఆర్టీసీ చైర్మన్ పదవి స్వికరించినట్లు పేర్కొన్నారు.
ప్రజల ఆశీర్వాదం వల్ల ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. అను నిత్యం ప్రజలకు ఇంకా ఏమి చేయాలనే తపన తప్పిస్తే ఇంకా ఏమి ఆలోచించనని అయన అన్నారు. జిల్లాలోనే సిరికొండ మండలంలో అత్యధికంగా గిరిజనులు నివసిస్తున్నారు. అందు వల్ల తాండలలో రోడ్ల నిర్మాణానికి. పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తో మాట్లాడి. ఎన్ఆర్జిఎస్ నిధులను మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఆయా తాండాలలో రోడ్ల నిర్మాణం పనుల కోసం త్వరలో శంకుస్థాపణలు చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్పారు. తన రాజకీయ వారసుడైన తన కుమారుడు బాజిరెడ్డి హగన్మోహన్ ను నన్ను ఆశీర్వధించిన రీతిలో అందరించాలని గోవర్ధన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ కన్న తండ్రిగా నాకన్న గొప్ప పేరు ప్రజలల్లో సంపాదించుకోవాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే గోవర్ధన్ ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement