నిజామాబాద్ జిల్లా బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ గేట్ ఎదుట కార్మికులు శుక్రవారం రిలే నిరాహార దీక్షలకు పూనుకున్నారు. తమ జీవితాలను షుగర్ ఫ్యాక్టరీపై ఫణంగా పెట్టినప్పటికీ పాలకులు నిర్లక్ష్యం చేస్తూ ఫ్యాక్టరీకి మూతవేయడం, కార్మికులకు కొన్నేళ్లుగా జీతభత్యాలు చెల్లించకపోవడంపై కార్మిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా పాలకులు స్పందించి నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని, కార్మికుల పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ దీక్షలను తమ డిమాండ్లు నెరవేర్చే వరకు చేపడతామని హెచ్చరించారు. ఉద్యమ సమయంలో ఉద్యమ నాయకులు ఫ్యాక్టరీని తెరిపిస్తామని మాటిచ్చి అధికారంలోకి వచ్చి రైతులను, కార్మికులకు మోసం చేశారని వామపక్ష నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.