Friday, November 22, 2024

నాణ్యమైన భోజనం అందించాలి: పోచారం శ్రీనివాస రెడ్డి

బాన్సువాడ : కామారెడ్డి జిల్లా బాన్సుబాడ పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అకస్మీకంగా తనిఖీ చేసి ఉదయం వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు. మెను ప్రకారం పప్పు దినుసులు, మసాలాలను వంటలలో వాడి నాణ్యమైన, రుచికరమైన భోజనం వండారా అని వార్డెన్, సిబ్బందిని ప్రశ్నించారు. స్టోర్ రూంలో సరుకులను పరిశీలించి, అనంతరం విద్యార్థులతో కలిసి టిఫిన్ చేసారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. వసతి గృహాలలో లోపాలను సవరించడానికే అకస్మీక తనిఖీ చేసిన‌ట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు అందరూ పేదరికం నుండి వచ్చిన వారే అని, మన పిల్లలు ఎంతో వారు కూడా అంతే అన్నారు. మంచి భోజనం పెట్టడం మన బాధ్యత, హాస్టళ్ల నిర్వాహణకు ప్రభుత్వమే కావలసిన నిధులను మంజూరు ఇస్తుంద‌న్నారు. చిన్నప్పటి నుండి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తే పిల్లలు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటార‌న్నారు. ప్రభుత్వ వసతి గృహాలలో మెరుగైన వసతులకు, పరిశుభ్రతకు స్పెషల్ డెవలప్మెంట్ నిధులు కెటాయించ‌డం జ‌రిగింద‌న్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు చాలీచాలని మెస్ చార్జీలతో పిల్లలకు సరిగ్గా ఆహారం అందించలేని పరిస్థితి, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ హాస్టళ్ల‌లో పిల్లలకు కడుపు నిండా తిన్నంత భోజనం అందే విదంగా మెస్ చార్జీలను భారీగా పెంచార‌ని గుర్తు చేశారు. నాణ్యమైన సరుకులు, కూరగాయలను కొనుగోలు చేసి రుచికరమైన ఆహారాన్ని వండాలి, ఆహారం వండేటప్పుడు, పిల్లలకు వడ్డిస్తున్న సమయంలో వార్డెన్లు ఖచ్చితంగా హాస్టల్ లో ఉండాల‌ని, లేకపోతే చర్యలు తీసుకుంటామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement