Friday, November 22, 2024

ప్రజా సంక్షేమమే ద్యేయం.. మేయర్ నీతూ కిరణ్

నిజామాబాద్ సిటీ, మే 23 (ప్రభ న్యూస్) : ప్రజా సంక్షేమమే తమ ధ్యేయమని తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని నగర మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు. మంగళవారం నిజామాబాద్ నగరంలోని నాల్కల్ రోడ్డు వద్ద గల మేయర్ క్యాంప్ కార్యాలయంలో నిజామాబాదు నగర మేయర్ దండు నీతూ కిరణ్ ని, స్టేట్ ఏసీ ఎస్ఎం కన్సల్టెంట్ సురేష్, డి ఎం హెచ్ ఓ సుద ర్శనం మర్యాద పూర్వకంగా కలిసారు. టీబీ నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి మేయర్ సహకారం కావాలని కోరారు.

టీబీ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందేలా యాక్షన్ ప్లాన్ రూపొందించమని డీఎంహెచ్వో కు మేయర్ సూచించారు. టీబీ పై అవగాహనా పెంచే ఏ కార్యక్రమానికైనా తాను హాజరవుతానని తెలిపారు. దేశంలోనే నిజామాబాదు జిల్లాకు టీబీ నియంత్రణలో పేరు వచ్చిందని, క్షయ విభాగం ఉద్యోగులు తమ సేవలు ఇలాగే కొనసాగిస్తూ నిజామాబాదును టీబీ రహిత జిల్లాగా మార్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డాక్టర్ యం.సుదర్శనం, జిల్లా టీబీ కోఆర్డినేటర్ రవి, డీపీపీఎం నరేష్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement