Saturday, November 23, 2024

ప్రజా సంక్షేమమే కేసీఆర్ ధ్యేయం.. ఎమ్మెల్యే గణేష్ బిగాల

నిజామాబాద్ సిటీ, జులై 13(ప్రభ న్యూస్): ప్రజా సంక్షేమమే ద్యేయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు. గురువారం నిజామాబాద్ నగరంలోని 17వ డివిజన్ లో 1 కోటి రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను భూమిపూజ చేసి ప్రారంభించారు. 17వ డివిజన్లో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యే గణేష్ బిగాలకి స్థానిక కార్పొరేటర్ మాయవార్ సవిత రాజు, మాజీ కార్పొరేటర్ మాయవార్ సాయిరాం, కో అప్షన్ మెంబర్ చంద్రకళ, నాయకులు,కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు. 17వ డివిజన్ లోని గౌతమ్ నగర్ లో ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలుస్తూ సమస్యలను తెలుసుకున్నారు. ఈ సంద ర్భంగాఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉందన్నారు.


ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. నిజామాబాద్ నగరం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక నిధులు మంజూరు చేశారనీ తెలిపారు. గడిచిన 9 ఏండ్లలో నిజామాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దామని పేర్కొన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజి, ఎల్లమ్మ గుట్ట రైల్వే కమాన్ వద్ద RUB నిర్మించి నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీర్చామన్నారు.. నగర అభివృద్ధి తమ ప్రధాన నినాదమన్నారు. ప్రధాన రహదారులను విశాలంగా మార్చి, సెంటర్ మీడియాన్ లు, అందమైన చెట్లను ఏర్పాటు చేసామన్నారు. TUFIDC ద్వారా రూ.63 కోట్లు నిజామాబాద్ నగరానికి మంజూరు చేసామన్నారు. ప్రతి డివిజన్ కి కోటి రూపాయలు కేటాయించామని, ప్రతి డివిజన్ లో అంతర్గత రోడ్లు, రోడ్ల పునరుద్ధరణ చేయడానికి ఈ నిధులు ఉపయోగించే విధంగా కార్యాచరణ రూపొందించామన్నారు. స్థానిక కార్పొరేటర్ సమస్యలను గుర్తించి ఈ నిధులతో అభివృద్ధి పనులు చేస్తామనీ తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకు మీ అందరి సహకారం ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్ ,17వ డివిజన్ నాయకులు మాయవార్ సంతోష్, దారం సాయిలు,జీవన్, శ్రీను, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement