Friday, November 22, 2024

రూ. 6కోట్లతో అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు : మంత్రి ప్రశాంత్​ రెడ్డి

భీమ్ గల్ టౌన్ : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నింబాచల క్షేత్ర సన్నిధిలో రూ.6 కోట్లతో అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని రాష్ట్ర రోడ్డు భవనాలు, గృహనిర్మాణా, శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి ఆదేశించారు. ఈరోజు భీమ్ గల్ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం వద్ద అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటు కోసం స్థలాన్ని అటవీశాఖ అధికారులు, స్థానిక లీడర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అర్భన్ పార్కుకు సంబంధించిన ప్రపోజల్స్, నిర్మాణం తదితర అంశాలపై అధికారులు మంత్రికి వివరించారు. అర్బన్ పార్కు ఏర్పాటుతో పాటు సుమారు 500ఎకరాలున్న అడవిని ఆధునిక పద్దతిలో పునరుద్దరణ చేయడం జరుగుతుందన్నారు. పార్కు ఏర్పాటుకు అడిగిన వెంటనే స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిలకు మంత్రి ప్రత్యేక ధన్యవాదమలు తెలిపారు.

అర్బన్ పార్కు ఏర్పాటుతో నింబాచల క్షేత్ర భక్తులకు ఎంతగానో ఉపయోగం:
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో నుండి పుట్టిన మరో వినూత్న ఆలోచన అర్బన్ ఫారెస్ట్ పార్కు అని మంత్రి వేముల అన్నారు. ఈ ప్రాంత భక్తుల ఆరాద్య దైవంగా వెలుగొందుతున్న లింబాద్రి గుట్ట సమీపంలో పార్కు ఏర్పాటు చేయడం స్వామి భక్తులతో పాటు పట్టణ సమీపంలోని వాసులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఎంతగానో ఉపయోగవుతుందన్నారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు సేదతీరేందుకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.
ఇవి ఏర్పాటు చేస్తారు :
క్షేత్రం సమీపంలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించిన ప్రాంతంలో సుమారు రూ.6 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేస్తామన్నారు. ఈ పార్కులో 5 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్కు, ఓపెన్ జిమ్, లైటింగ్, వాష్ రూమ్స్, వాచ్ టవర్లు, బట్టలు మార్చుకునేందుకు గదులు, వాచ్ టవర్లు, చిట్టడవి, కంపౌండ్ వాల్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయడం జరిగిందని తెలిపారు. ప్రతిపాదనలపై త్వరలో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో హైదరాబాద్ లో సమావేశమై చర్చిస్తానన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో త్వరలో మంజూరై అందుబాటులోకి పార్కు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పార్కు స్థలాన్ని పరిశీలించిన వారిలో జిల్లా ఫారెస్ట్ అధికారి సునిల్ఈరమన్, ఆర్డీవో శ్రీనివాసులు, స్థానిక​ అటవీశాఖ అధికారులు, స్థానిక లీడర్లున్నారు. ఈ సందర్భంగా పార్కు ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలంలో మంత్రి మొక్కలను నాటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement