నిజామాబాద్ . . . నిజామాబాద్ నగరంలోని ప్రగతినగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. మాక్లూర్ మండలం మాదాపూర్ కు చెందిన సూరజ్ (17) మూడు రోజుల క్రితం బైక్ పై వెళ్తూ కిందపడిపోయాడు. తీవ్ర గాయాలైన సూరజ్ ను తల్లి నగరంలోని ప్రతిభ ఆసుపత్రిలో చేర్పించారు. గురువారం వరకు ఆసుపత్రిలో రూ.3 లక్షల బిల్లును చెల్లించినట్లు తెలిసింది. గురువారం సాయంత్రం సూరజ్ చికిత్స పొందుతూ చనిపోగా మృత దేహం కోసం మరో లక్షన్నర చెల్లిస్తేనే ఇస్తామని ఆసుపత్రి నిర్వాహకులు మొండికేశారు. దాంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు.
చనిపోయిన విద్యార్థి ఆర్థిక పరిస్థితి బాగలేకపోయిన అతన్ని కాపాడుకునేందుకు అతని కన్నతల్లి మూడు లక్షలు చెల్లించినా లక్షన్నర కోసం వేదించడం సరికాదన్నారు. ఈ విషయంలో నిర్వాహకులతో విద్యార్థులు వాగ్వివాదానికి దిగారు. నిర్వాహకులు మాత్రం వైద్యంకు అయ్యే ఫీజు గురించి ముందే చెప్పామని మిగితా డబ్బులు కడితేనే మృతదేహం ఇస్తామని మొండి కేశారు. దానితో బాధితులు, విద్యార్థులతో కలిసి ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగారు.