నిజామాబాద్ సిటీ, (ప్రభ న్యూస్) : సీఎం కేసీఆర్ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు యత్నిస్తున్నారని… రాబోయే రోజుల్లో ప్రజలు తగిన విధంగా సమాధానం చెబుతారని బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ పర్యటన నేప థ్యంలో సభా స్థలి వద్ద జరుగుతున్న ఏర్పా ట్లను ఈటల, ఎంపీ ధర్మపురి అరవింద్ తో కలిసి పరిశీలించారు.
గ్రామాల్లో చేపడుతున్న జీపీ భవనాలు, మహిళా సమాఖ్య భవనాలు, మొక్కలు, శ్మశానవాటికలు, ఇతరత్ర పనులన్నీ కేంద్రం నిధులతో చేస్తున్నారని, రాష్ట్రంలో సొమ్మొకరిది.. సోకొకరిది అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఈటల విమర్శించారు. ప్రధాని మోదీ తెలంగాణ అభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తు న్నారని ఈటల తెలిపారు. ప్రధాని మోదీ ఇప్పటివరకు తెలంగా ణలో అభివృద్ధి పనుల కోసమే వచ్చారని, రాజకీయాల కోసం రాలేదని అన్నారు.
రాష్ట్ర రైతాం గాన్ని దృష్టిలో పెట్టుకుని రూ.6300 కోట్లు వెచ్చించి మూతపడిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించి అంకితం చేశారని గుర్తుచేశారు. ఎన్టీపీసీ ద్వారా 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి తెలంగాణకు కొరత లేకుండా చేయాలని నిర్ణయించారని, అందులో భాగంగా 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును ఇందూరులో ప్రారంభించనున్నారని తెలిపారు. రెండు నెలల్లో మరో 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజె క్టును ప్రారంభిస్తారని చెప్పారు.