నిజామాబాద్ ప్రతినిధి, ఆగస్టు 30(ప్రభ న్యూస్) : రాజకీయాలకు సంబంధం లేకుండా స్వయం ప్రతిపత్తితో ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీస్ రక్షణ వ్యవస్థ అధికార పార్టీ నాయకులకు గులాంగిరి చేయడం సిగ్గు చేటని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మండిపడ్డారు. అలాంటి అధికారులు ఖాకి చొక్కా తీసి ఖాద్దరు చొక్కా వేసుకోవాలని ఎద్దేవా చేశా రు.సీఐల బదిలీ ఉత్తర్వులు ఇచ్చి మళ్ళీ ఆపడం పై ఉన్న మతాలబ్ ఏంటో కమీషనర్,ఐజీ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న సీఐల బదిలీ ఉత్తర్వులు ఆగిపోవడం పై నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ స్పందించారు.
ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలో కొందరి సీఐల పై ఎన్నో అభియోగాలు వస్తున్నా ఏళ్ల తరబడి అదే పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నా ఎందుకు వారి పై చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం హయాంలో కొందరు ఖాకీలు గులాబీ కండువా వేసుకు న్న కార్యకర్తలగా పని చేసి ప్రభుత్వం మారగానే వారు కూడా పార్టీ ఫిరాయించి నట్లు కాంగ్రెస్ నేతలకు గులాం గిరి చేస్తు న్నారన్నారు.
నిజామాబాద్ నగరంలో పోలీస్ అధికారిగా పని చేయాలంటే ముం దు కాంగ్రెస్ కండువా కప్పుకొని ఇక్క డ రావాలా ఏంటి అని ఏద్దేవా చేశారు. ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభుత్వ అన్ని శాఖల్లో తలదుర్చడం వల్లే ఈ తంతు అంత జరుగుతుందని మండి పడ్డారు. పోలీస్ వ్యవస్థ పైన ప్రజలకు అపార నమ్మకం ఉందని కొందరు అధి కారుల కారణంగా మొత్తం వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుందని అలాంటి వారు నిజా మాబాద్ నగరాన్ని వదిలి వెళ్లిపోవాలని సూచించారు. నగరంలో శాంతి భద్రతల పైన సామాన్యులకు న్యాయం చేసే అంశా ల పైన దృష్టి పెట్టకుండా రాజకీయ నాయ కులకు గులాంగిరి చేస్తానంటే చర్యలు తప్పవు అని హెచ్చరించారు.