Thursday, September 12, 2024

NZB: సహాయ కార్యక్రమాల్లో పాల్గొనండి… బీజేపీ శ్రేణులకు ఎంపీ అరవింద్ పిలుపు

నిజామాబాద్ ప్రతినిధి, సెప్టెంబర్ 2(ప్రభ న్యూస్) : జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలపై నిజామాబాద్ అండ్ జగిత్యాల జిల్లాల కలెక్టర్లకు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి లేఖ రాశారు. లేఖలో జిల్లాలో ఇప్పటికే పలుచోట్ల రోడ్లు తెగిపోయి రాకపోకలకు అంతరాయం కలుగుతుందని, మరో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ ఆర్ అండ్ బీ, పోలీస్, విద్యుత్, ఆరోగ్య శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి యుద్ధ ప్రాతి పదికన సహాయక చర్యలు చేపట్టాలని కోరారు.

ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా తగు చర్యలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా 40గేట్లు తెరిచినందున మత్స్యకారులు, జాలర్లను అప్రమత్తం చేయాలని, నిరాశ్రయులైన లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి, వారికి కనీస సౌకర్యాలు అందజేయాలని కోరారు.

మరోవైపు ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయట తిరగవద్దని ఆయన కోరారు. వ్యవసాయ మోటర్ల వద్ద రైతులు జాగ్రత్తగా ఉండాలని, గోదావరి పరీవాహక గ్రామాల మత్స్యకారులు, జాలర్లు చేపల వేటకు వెళ్లకుండా ఉండాలని, ఎక్కడైనా ఇబ్బందులుంటే భారతీయ జనతా పార్టీ శ్రేణులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement