Tuesday, November 26, 2024

NZB: సిరికొండ మండలంలో 1085 ఎకరాల్లో వరి పంట నష్టం

సిరికొండ, జులై 29 (ప్రభ న్యూస్): గత 3 రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు సిరికొండ మండలంలో ప్రాథమికంగా 435మంది రైతులకు చెందిన 1085 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు మండల వ్యవసాయ అధికారి జె. వెంకటేష్ తెలిపారు. ఏఓ అందించిన వివరాల ప్రకారం.. ఈనెల 26న రాత్రి నుంచి 27 వరకు కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన వరి పంటను గ్రామ వ్యవసాయ విస్తీర్ణ అధికారులు ప్రాథమికంగా అందించిన నివేదిక ప్రకారం… మండలంలో 435 మంది రైతులకు చెందిన 1085 ఎకరాలలో వరి పంటకు నష్టం జరిగినట్లు అయన చెప్పారు.


కొన్ని గ్రామాల్లో వాగుల్లో పారుతున్న నీటి ఉదృతి వల్ల దెబ్బతిన్న పంటలను వ్యవసాయ అధికారులు అంచనా వేయలేక పోయారు. వాగుల్లో నీటి ప్రవాహం తగ్గిన వెంటనే దెబ్బతిన్న పంటల వివరాలు తెలుసుకుంటారని అయన వివరించారు.
మొక్కజొన్న, సోయ, ప్రత్తి పంటల్లో నీరు నిలిచిన యెడల నీటిని తొలగించి 19:19:19 నైట్రోజన్, పాస్పరస్, పోటాష్ (ఎన్పికె ) లీటర్ నీటిలో 10 గ్రాములు కలిపి పిచికారి చేయాలని వ్యవసాయ అధికారి రైతులకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement