Friday, November 22, 2024

NZB: డీసీసీబీలో నెగ్గిన అవిశ్వాసం.. ఇన్చార్జి చైర్మన్ గా కుంట రమేష్ రెడ్డి..

నిజామాబాద్, మార్చి 21(ప్రభ న్యూస్): ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మన్ పదవిపై పెట్టిన అవిశ్వాసం నెగ్గిందని డీసీవో శ్రీనివాస్ రావు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఉమ్మడి డీసీసీబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఈనెల 4న చైర్మ న్ పదవిపై వైస్ చైర్మన్ తో సహా కొంతమంది డైరెక్టర్లు అవిశ్వాసంపై వినతిపత్రం అందజేశారన్నారు. అందుకు సంబంధించి అవిశ్వాసంపై ఇవాళ పాలకవర్గ సమావేశం నిర్వహిస్తామని ఈనెల 5న పాలకవర్గ సభ్యులకు నోటీసులు అందజేశామని తెలిపారు.

అవిశ్వాసంపై నిర్వహించిన పాలకవర్గ సమావేశానికి 17మంది డైరెక్టర్లు హాజరయ్యారన్నారు. సమావేశంలో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 16మంది మాత్రమే మద్దతు తెలపగా ఎట్టకేలకు అవిశ్వాసం నెగ్గినట్లు వెల్లడించారు. వైస్ చైర్మన్ కుంట రమేష్ రెడ్డికి ఇంచార్జ్ చైర్మన్ గా బాధ్యతలు అప్పజెప్పినట్లు తెలిపారు. అదేవిధంగా చైర్మన్ ఎన్నికపై ఈనెల 26న పాలకవర్గ సమావేశాన్ని నిర్వహిస్తామని సీఈవో తెలిపారు.

- Advertisement -

క్యాంపు నుంచి నేరుగా కార్యాలయానికి..
పాలకవర్గ సభ్యులు గురువారం క్యాంపు నుంచి నేరుగా డీసీసీబీ కార్యాలయంలో నిర్వహించిన పాలకవర్గ సమావేశానికి హాజర య్యారు. కానీ భాస్కర్ రెడ్డి మాత్రం పాలకవర్గ సమావేశానికి హాజరు కాలేదు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మన్ పదవి కోల్పోవడం బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది.

డీసీసిబీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు సందడి..

భాస్కర్ రెడ్డిపై అవిశ్వాసం నెగ్గడంతో కాంగ్రెస్ శ్రేణులు డీసీసీబీ కార్యాలయం వద్ద టపాకాయలు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈసందర్భంగా ఉర్దూ అకాడమీ చైర్మన్ తహేర్ బిన్ హామ్దాన్, కాంగ్రెస్ శ్రేణులు ఉంటా రమేష్ రెడ్డిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement