నిజామాబాద్ సిటీ, డిసెంబర్ 28(ప్రభ న్యూస్):
ప్రజల వద్దకే ప్రజాపాలన అని… ప్రజాపాలన ను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ కోరారు. గురువారం నిజామాబాదు నగరంలో 26 వ డివిజన్ లో శివాజినగర్ గౌడ సంఘం లో ప్రజా పాలనా కార్యక్రమాన్ని అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ తో కలిసి కార్యక్ర మా న్ని ప్రారంభించారు.
ఈ సంద ర్బంగా సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 6 గ్యారెంటీ పథకాలు కింది స్థాయి వరకు చేరేదాకా ఉండాలన్నారు ఎవరికీ ఇబ్బందులు కాకుండా ప్రభు త్వం చర్యలు తీసుకుంది.. 6 గ్యారెంటీ పథకాలే కాకుండా ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే జనరల్ కౌంటర్ ద్వారా మీరు దరఖాస్తు చేయాలనీ అన్నారు. ప్రజా పాలనా కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది అన్నారు. దరఖాస్తు పారం లో తప్పులు లేకుండా చూసి నింపాలని అన్నారు. అధికారులు ప్రజలకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. ప్రతి డివిజన్ లో రెండు కౌంటర్ లు ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు ఎవరు ఇబ్బంది పడవద్దన్నారు. 6 వ తేదీ వరకు కొనసా గుతుందన్నారు ఈ కార్యక్రమం లో డీసీపీ శ్యామ్ స్థానిక కార్పొరేటర్ బంటు వైష్ణవి రాము, అధికారులు పాల్గొన్నారు.