Thursday, November 21, 2024

Nizamabad | అమిత్ షా ని కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్..

నిజామాబాద్ సిటీ, (ప్రభ న్యూస్) : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లో గురువారం జరిగిన బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశానికి హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పట్టణ శాసనసభ్యులు ధన్‌పాల్ సూర్యనారాయణ శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ ను అమిత్ షా అభినందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ధన్‌పాల్‌కు అమిత్ షా అభినందనలు తెలిపారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో చుర కైన పాత్ర పోషించాలని, తనను నమ్ముకున్న ప్రజలకు సేవ చేయాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement