Friday, November 22, 2024

ధాన్యం కొనుగోళ్లలో నిజామాబాద్‌ టాప్‌..

నిజామాబాద్ : యాసంగి ధాన్యం కొనుగోళ్లలో నిజామాబాద్‌ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో ఇప్పటివరకు ఏకంగా 6.24 లక్షల టన్నుల ధాన్యం సేకరించారు. ఆ తర్వాత 3.26 లక్షల టన్నులతో నల్లగొండ రెండో స్థానంలో, 3.12 లక్షల టన్నులతో సిద్దిపేట మూడో స్థానంలో నిలిచింది. ఇక రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగింపు దశకు చేరుకొన్నది. మొత్తం 6,584 కేంద్రాలకు 5,134 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ముగియడంతో అధికారులు వాటిని మూసివేశారు. 1,450 కేంద్రాల్లో స్వల్పంగా సేకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 8.65 లక్షల మంది రైతుల నుంచి 48 లక్షల టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీని విలువ రూ.9,397 కోట్లు కావడం గమనార్హం. మరో 2 లక్షల టన్నుల వరకు వచ్చే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి రైతుకు సంబంధించిన చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగానే మొత్తం ధాన్యం సేకరణ పూర్తయ్యే వరకు కొనుగోలు కేంద్రాలను నిర్వహించనున్నది.

టాప్‌-5 జిల్లాలు (టన్నుల్లో)

జిల్లా : కొనుగోలు ధాన్యం
నిజామాబాద్ ‌: 6,42,894
నల్లగొండ : 3,26,859
సిద్దిపేట : 3,12,644
జగిత్యాల : 2,83,673
మెదక్‌ : 2,80,039

Advertisement

తాజా వార్తలు

Advertisement