నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్)7:* ఈ ఎన్నికల్లో దొరల పాలనపై ప్రజల పోరాటమని నిజామా బాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. ఎన్నికల్లో గెలువా ల్సింది దొరలు కాదు. ప్రజలు గెలవాలన్నారు. నిజామాబాద్ ఓటుతో రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చేటువంటి అవకాశాన్ని కల్పించండనీ కోరారు. మీరు వేసిన, వేయిం చిన ఓటుతో ప్రజల గౌరవాన్ని మరింత పెంచుతాననీ అన్నా రు. మనమందరం కలిసికట్టుగా ఉంది అందరిని కలుపుకొని ముందుకు వెళ్లి రాష్ట్రంలోని నిజామాబాద్ ని అభివృద్ధిలో అగ్రగామిగా ఉంచుదామని తెలిపారు.
నిజామాబాద్ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి నెహ్రూ పార్కు వద్ద సభను ఉద్దేశించి షబ్బీర్ అలీ ప్రసంగించారు. నిజామాబాద్ నాకు కొత్తేమీ కాదు నిజామాబాద్ తొ నాకు విడదీయలేని సంబంధం ఉంది ఉమ్మడి నిజామాబాద్ డిసిసి అధ్యక్షునిగా రెండు పర్యా యాలు.. మంత్రిగా ఇక్కడ ప్రతి ఇంటితో నాకు అనుబంధం ఉందనీ తెలిపారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తతో కుటుంబ సభ్యుల తరహా అనుబంధం ఉంది నాది డి. శ్రీనివాస్ ది రామలక్ష్మణ అనుబంధం అని అన్నారు.మనమందరం 10 సంవత్స రాలలో ఎంతో వెనక పడిపో యామనీ పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అణచి వేయబడ్డారు.. కేసులతో బిఆర్ఎస్ నాయకుల దాడు లతో తమ ఆస్తులు భూములు కబ్జాలతో ఎంతో కుంగి కృషించి పోయారన్నారు.అందరూ ఐకమత్యంతో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి పట్టణ ప్రజలందరికీ సేవ చేద్దామని పిలుపునిచ్చారు. .
. ఈ కార్యక్ర మంలో పట్టణ అధ్య క్షులు కేశవేణు ,నిజామాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షులు మనాల మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత. మాజీ ఎమ్మెల్సీ అరికెల నరసారెడ్డి. మాజీ డిసిసి అధ్యక్షుడు గడుగు గంగాధర్. పీసీసీ ఉపాధ్యక్షులు తహర్ బిన్ హందన్, సీనియర్ నాయకులు నగేష్ రెడ్డి, మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఇర్ఫాన్ అలీ, విక్కీ యాదవ్ . రామ్మర్తి గోపి. రోహిత్. రామకృష్ణ. ఘన్రాజ్. సుమన్. బ్లాక్ అధ్యక్షులు అబుద్ హందని, పట్టణ అధ్యక్షులు అజాజ్, నజీబ్ అలీ, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపి, NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్,NSUI జిల్లా అధ్యక్షులు వేణు,జావీద్ అక్రమ్, అహ్మద్ భాయ్, అసద్ హందన్, ముజేహిద్ ఖాన్, అజిజ్ అన్సారీ, ఇఫతేకర్ NRI, మాసూద్ అజాజ్, ఇల్యాస్ ఖాన్, షఫీ, కరీం, నయీమ్, జకీర్, నావాజ్, మొయిన్ తతిదరులు పాల్గొన్నారు.