నిజామాబాద్ సిటీ, డిసెంబర్ (ప్రభ న్యూస్)11: నిజామాబాద్ జిల్లాలో గత కొన్ని మాసాలుగా ఉత్తరాలు పంచకుండా ఇంటివద్దె ఉంచిన పోస్ట్ మాన్ పై క్రమ శిక్షణ చర్యలో భాగంగా సస్పెండ్ చేసినట్లు తపాలా శాఖ సహాయ సూపరింటెండెంట్ రాజా నర్సాగౌడ్ (ఏ ఎస్పి) రాజా నర్సాగౌడ్ తెలిపారు.గత కొన్ని నెలలుగా నగరం లోని సుభాష్ నగర్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో ఉత్తరాలు రావడం లేదని ప్రజల ఫిర్యాదు చేశారు. సుభాష్ నగర్ ఉప తపాలా కార్యాలయంలో పని చేసే పోస్ట్ మాన్ తన దగ్గరకు వచ్చిన ఉత్తరాలను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయకుండా ఐదారు నెలల నుంచి తపాలా శాఖ నుంచి తీసుకొచ్చిన ఉత్తరా లను తీసుకుపోయి ఇంట్లోనే ఉంచారు.
తపాలా శాఖ సహాయ సూపరిం టెండెంట్ రాజా నర్సాగౌడ్ ఎంక్వయిరీలో భాగంగా పోస్ట్ మాన్ విచారిం చగా అతని ఇంటి వద్ద సుమా రు 11 ఉత్త రాల సంచులు దొరికా యి.. ఆ ఉత్తరాల సంచులను సుభాష్ నగర్ పోస్ట్ ఆఫీస్ కార్యాల యానికి తీసుకువచ్చివాటిని పరిశీలించగా. అందులో పాన్, ఓటర్ ఐడి కార్డ్ ,ఆధార్, డ్రైవింగ్ లైసె న్స్లు, బ్యాంక్ చెక్ బుక్ లు తదితర ఉత్తరాలు ఉన్నాయి. ఉత్తరాలను త్వరలో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.