Friday, November 22, 2024

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సేవలు భేష్ .. మంత్రి వేముల ప్ర‌శంస‌లు

నిజామాబాద్ సిటీ, (ప్రభ న్యూస్): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలు అందిస్తున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రశంసించారు. పేదలకు మెరు గైన సేవలందించేందుకు కృషి చేస్తున్న డాక్ట‌ర్లు, సిబ్బంది అందరికీ అభినందనలు తెలిపారు. బుధవారం జనరల్ ఆసుపత్రిలో రూ.1.95 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఫైర్ సేఫ్టీ సిస్టం పనులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జెడ్పి చైర్మన్ విఠల్ రావు, ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మేయర్ నీతూకిరణ్ తో కలిసి శంకుస్థాపన చేశారు.

అదేవిధం గా జొస్ ఆలుక్కాస్ జ్యూవెల్లరీ సంస్థ రోగుల సేవల కోసం ఆసుపత్రికి వితరణ చేసిన సుమారు రూ.30లక్షల విలువ చేసే బస్సును ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం, రెడ్ క్రాస్ సంస్ధల సంయుక్త ఆధ్వర్యంలో వృద్ధులు, ట్రాన్స్ జెండర్ లకు వైద్య సేవలు అందించేందుకు సమకూర్చిన సంచార అంబు లెన్స్ ను, జాన్సన్ అండ్ జాన్స న్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిమ్యులేషన్ వర్క్ షాప్ మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement