నిజామాబాద్ ప్రతినిధి జనవరి18: (ఆంధ్రప్రభ) – విద్యార్థుల్లో దేశభక్తి శారీర క,మానసిక దృఢ త్వం పెంపొందించే విధంగా మహనీయుల జయంతి సందర్బంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఖేలో భారత్ ప ఉత్సవాలు నిర్వహిం చడం అభినందనీ యమ ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పా ల్ సూర్యనారా యణ అన్నారు. స్వామి వివే కానంద, సుభాష్ చంద్రబో స్ మహనీయుల జయం తుల సందర్బంగా అఖిల భారతీయ విద్యార్థి పరిష త్ (ఏబీవీపీ ) ఆధ్వర్యం లో శనివారం జీజీ కళా శాల మైదానంలో నిర్వ హించిన ఖేలో భారత్ ఉత్సవాల ప్రారంభోత్స వానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూవిద్యార్థులు, యువతరం నేడు మాద కద్రవ్యలకు అలవాటు పడి ఉజ్వలమైన భవిష్య త్ అంధకారంలోకి వెళ్తుం దని మారకద్రవ్యల మత్తు వదిలి మైదానంలోకి వచ్చి శారీరక, మానసిక దృఢ త్వాన్ని పెంపొందించు కోవాలని పిలుపుని చ్చా రు. కేంద్రప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన తరువా త గత పదేళ్ల నుండి క్రీడా కారులను ప్రోత్సాహి స్తుం దని, ఖేలో ఇండియా పేరుతో ఎంతో మంది క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేల క్రీడాకారులకు మౌలిక సౌకర్యాలు కల్పిం చడం జరుగుతుం దన్నా రు.
మహనీయులు కలలు కన్న భారతదేశ అభి వృద్ధిలో నేటి యువతరం కీలక పాత్ర పోషించాలని కోరారు. దేశం మనకు ఏమి ఇచ్చింది అనకుండా దేశానికి మనము ఏమి ఇచ్చాము అనే విదంగా జాతీయ పునర్నిర్మానంలో భాగస్వాములు కావాలని చెప్పారు.
ఈ కార్యక్రమం లో ఏబీవీపీ ఇందూర్ ప్రముఖ్ రెంజర్ల నరేష్, విభాగ్ ఆర్గనైజషన్ సెక్ర టరీ రాజ్ సాగర్, విభాగ్ కన్వినర్ శశి, సునీల్ పాల్గొన్నారు.