నిజామాబాద్ ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : సాయి ఆయుష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నవజాత శిశువు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం తాడ్‌బిలోలి గ్రామానికి చెందిన నరేష్ గౌడ్ గంగామణి దంపతుల సంతానమైన ఫ్రీ మెచ్యూర్ డెలివరీ కాగా.. బాలుడిని వైద్యం కోసం నిజామాబాద్ నగరంలోని ఖలిలవాడిలో గలసాయి ఆయుష్ పిల్లల ఆస్పత్రిలో వైద్యం కోసం అడ్మిట్ చేశారు.
నెలలు తక్కువగా ఉండగానే జన్మించడంతో నవజాత శిశువు ఆరోగ్యం కోసం ఆస్పత్రిలో వైద్యం కోసం లక్షల రూపాయలు ఫీజులు కట్టారు. కానీ ఫలితం లేకుండా పోయిందని బాధితులు వాపోయారు. ఆసుపత్రి ఎదుట న్యాయం చేయాలనీ ఆందోళన చేశారు. ఈ ఘటనపై ఆసుపత్రి వైద్యుడిని బాధితులు ప్రశ్నించగా ఆరోగ్య సమస్యతో శిశువు మృతి చెందాడని వైద్యుడు సంకీర్త్ రావు బాధితులకు చెప్పారు. శిశువు మృతిపై పూర్తి విచారణ చేపట్టిమాకు న్యాయం చేసేవరకు వెళ్లేది లేదంటూ బాధితులు ఆసుపత్రి ఎదుట భీష్మించుకొని కూర్చున్నారు.