Tuesday, November 12, 2024

NZB | తపాలా ఆఫీసులకు నూతన భవనాలు.. కేంద్ర మంత్రికి ఎంపీ అర్వింద్ ధన్యవాదాలు

నిజామాబాద్ ప్రతినిధి, నవంబర్12: (ఆంధ్రప్రభ) : నిజామాబాద్ జిల్లాలోని నందిపేట, బాల్కొండ, భీంగల్ మండల కేంద్రాల్లో నూతన తపాలా కార్యాలయాల భవనాల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. భీంగల్, నందిపేట, బాల్కొండ మండల కేంద్రాల్లో పోస్ట్ ఆఫీస్ భవనాల మంజూరు కోసం ఇటీవల ఆయా మండలాల ప్రజలు ఎంపీ అర్వింద్ ని కలిసి విన్నవించిన సంగతి తెలిసిందే.

వీరి విజ్ఞప్తులపై వెంటనే స్పందించిన ఎంపీ అర్వింద్ నూతన భవనాల మంజూరుకు సంబంధిత మంత్రి జ్యోతిరాధిత్య సింధియాకి లేఖ రాసి సత్వరమే భవనాలు మంజూరు చేయాలని కోరారు. తపాలా శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని, సంబంధిత పత్రాలు త్వరగా పంపేలా చొరవ తీసుకున్నారు. ఎంపీ అర్వింద్ విజ్ఞప్తులను పరిశీలించిన మంత్రి జ్యోతిరాధిత్య సింధియా నందిపేట, బాల్కొండ, భీంగల్ మండల కేంద్రాల్లో నూతన తపాలా కార్యాలయాల భవనాల నిర్మాణాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు ఎంపీ అర్వింద్ కి లేఖ ద్వారా తెలిపారు. తన విజ్ఞప్తుల పట్ల సానుకూలంగా స్పందించి, తక్షణమే భవనాలు మంజూరు చేసిన మంత్రి సింధియాకి పార్లమెంట్ ప్రజల తరఫున ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement