తెలంగాణలో బ్లాక్ ఫంగస్ అజలడి రేపుతోంది. తాజాగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో బ్లాక్ ఫంగస్ కలకలం రేపింది. ఐదుగురికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి. ఆలూరు, అంకాపూర్, మగ్గిడి, చేపూర్‌కు చెందిన ఐదుగురికి లక్షణాలు కనిపించాయి. బాధితులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. కాగా, జిల్లాలో ఇప్పటికే పలువురు బ్లాక్ ఫంగస్ బారిన పడి మృతి చెందారు. కరోనాతోపాటు బ్లాక్ ఫంగస్ విజృంభిస్తుందడంతో జిల్లా వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు ఉమ్మడి జిల్లాలో లాక్ డౌన్ కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో కలెక్టర్ నారాయణ రెడ్డి రంగంలోకి దిగారు. లాక్‌డౌన్ మినహాయింపు సమయంలో ప్రజల రద్దీని కలెక్టర్ స్వయంగా పరిశీలిస్తున్నారు. జిల్లా కేంద్రం లో కలెక్టర్ నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ కార్తికేయ పర్యటించారు. ఇవాళ్టి నుంచి మరింత కఠినంగా లాక్ డౌన్ అమలుకు ఆదేశాలు జారీ చేశారు. పాస్ లేకుండా రోడ్లపైకి వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.