Wednesday, November 20, 2024

నిజామాబాద్ జిల్లాలో వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలు

బాన్సువాడ, ఆగస్టు 15 (ప్రభ న్యూస్) : నిజమాబాద్ జిల్లాలో వాడవాడలా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికార నివాసంలో, బిచ్కుంద మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో ప్యానల్ స్పీకర్ హన్మంత్ షిండే 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండల కేంద్రంలోని బిచ్కుంద ఎంపీపీ అశోక్ పటేల్, జడ్పిటిసి భారతి రాజు, మైనార్టీ నాయకులు షేక్ పాష, భారత రాష్ట్ర సమితి నాయకులు డాక్టర్ రాజు, హాజీ లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

బాన్సువాడ డివిజన్ కేంద్రంలో ఘనంగా ‌77 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు
‌బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బాన్సువాడ డివిజన్ కేంద్రంలో‌‌ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, పట్టణ మున్సిపల్ కార్యాలయం, గాంధీ చౌక్, కొత్త బాన్సువాడ, ముదిరాజ్ సంఘం, త్రీ వీలర్ ఆటో యూనియన్, కోట బురుజు వద్ద నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మన్ 77వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణ చేశారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద స్పీకర్ వ్యక్తిగత సహాయకులు భగవాన్ రెడ్డి, నియోజకవర్గ బీఆర్ఎస్‌ పార్టీ కార్యాలయం వద్ద పట్టణ అధ్యక్షులు పాత బాలకృష్ణ, మున్సిపల్ కార్యాలయం వద్ద, గాంధీ చౌక్ వద్ద మున్సిపల్ చైర్మన్ గంగాధర్, కొత్త బాన్సువాడ ముదిరాజ్ సంఘం వద్ద అధ్యక్షులు సాయిలు, త్రీ వీలర్ ఆటో యూనియన్ వద్ద యూనియన్ అధ్యక్షులు సాయిలు గాంధీ చౌక్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీ కూరలు మోరలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా బాన్సువాడ ఆర్డిఓ కార్యాలయం వద్ద ఆర్డిఓ భుజంగరావు, మున్సిపల్ కార్యాలయం వద్ద జంగం గంగాధర్ లు పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా రైతుబంధు అధ్యక్షులు అంజిరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్ ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement