బీర్కూర్, ఆగస్టు 21, ప్రభ న్యూస్: బీర్కూరు మండల కేంద్రంలోని నాగ దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఇవాళ నాగుల చవితి కావడంతో భక్తులు ప్రసాదాలతో, పాలతో నాగ దేవాలయం చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగకు స్త్రీలు నాగదేవునికి ప్రత్యేక ప్రసాదాలను అందించి, దేవునికి సమర్పించినటువంటి పాలతో ఇంటికి చేరుకొని ఇంట్లోని కుటుంబ సభ్యులకు, దగ్గర బంధువులకు పాలతో కన్నులను కడుగుతారు.
నాగుల చవితి సందర్భంగా స్నేహ గణేష్ కమిటీ సభ్యులు ప్రతి ఏడులాగ ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో స్నేహ గణేష్ కమిటీ సభ్యులు గొల్ల ప్రభాకర్, క్యకప్ప పటేల్, కుమార్, సుజిత్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.