Tuesday, November 26, 2024

బిఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతికి అంతులేకుండా పోయింది – ఎంపి అర‌వింద్

నిజామాబాద్ సిటీ, ఫిబ్రవరి (ప్రభ న్యూస్)24: బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతికి అంతులేకుండా పోయిందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఎంపీ అరవింద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ కార్యాల యంలో ఎంపీ అరవింద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుని కలిసారు. నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టినందుకు కలెక్టర్ కు ఎంపీ పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా లోని పలు సమస్యలను కలెక్టర్ కు వివరిం చారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లా డుతూ బీ ఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గుండాలు, రౌడీలు రాజ్యమేలు తున్నారని గుండా ల నుంచి ప్రజలను, ప్రజాస్వా మ్యాన్ని కాపాడాలని కలెక్టర్ కోరారు. ఎమ్మెల్యేలు విచ్చల విడిగా భూకబ్జా లు, మొరం తవ్వకాలు చేస్తున్నారని ఆరో పించారు. గుట్టలు, మోరం ఇసుక, బ్రెడ్,బట్టర్ జామ్ లా అయిపోయిందని ఎద్దేవా చేశారు. బోధన్ ప్రాంతంలో పర్యటించానని అక్కడ పలు సమస్యలు మా దృష్టికి వచ్చా యని పేర్కొ న్నారు. ఎక్రమా డల్, మదినా తూలుమ్ పాఠశాలలో ఎయిడె డ్ విద్యార్థులు అంటూ కోట్ల రూపాయలు కాజేసిన సయ్యద్ రబాని బోధన్ ఎమ్మెల్యేకు బంధువు అవుతార‌ని ఆరోపిం చారు. నెక్స్ట్ జనరేషన్ కూడా గంజాయి కి అలవాటు చేస్తు న్నారనీ మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement