Friday, October 18, 2024

NZB | తల్లులు మొక్కల బోనం… పిల్లలు అక్షర బోనం…

నిజామాబాద్, ఆంధ్రప్రభ స్మార్ట్ : నిజామాబాద్ జిల్లాలోని జిల్లా పరిషత్ కంజర ఉన్నత పాఠశాలలో విద్యార్థులు వనమోత్సవ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించి తల్లిని మించిన దైవం లేదనే సందేశాన్ని అందించారు. నిజామాబాద్ జిల్లా శివార్లలోని కంజర్ గ్రామంలో శుక్రవారం జిల్లా పరిషత్ హైస్కూల్ కంజర్ లో తల్లుల మొక్క బోనాలు… పిల్లలు అక్షర బోనాలు అంటూ వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ గోపాల తెలియజేశారు.

ముందుగా చిన్నారులంతా బోనాలతో వచ్చిన తమ తల్లులందరికీ మొక్కులనిచ్చారు. ఆ బోనాలను స్వీకరించి డప్పువాయిద్యాలతో ఊరేగింపుగా పాఠశాలలోని సరస్వతీ విగ్రహం వద్దకు తీసుకొచ్చి బోనాలు సమర్పించారు. మొక్కలు నాటే ప్రదేశానికి తీసుకెళ్లిన అనంతరం పాఠశాల విద్యార్థులు తమ తల్లి పాదాలను నీటితో కడిగి వారితో కలిసి మొక్కలు నాటినట్లు గోపాలకృష్ణ తెలిపారు. అనంతరం ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో వన భోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గోపాలకృష్ణ వెంకటలక్ష్మి, అరుణశ్రీ, రాణి, గోపాలకృష్ణ, కాంతి కిరణ్‌, ఉమాగౌరి, భూమయ్య, విజయలక్ష్మి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement