బోధన్ : తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్ష పాత్ర పోషించిన ఉద్యమకారులకు బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను ఉద్యమకారుల సమక్షంలో నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బోధన్ పట్టణంలో 1516 రోజులు దీక్షలను నిర్వహించి తమ నిరసన కార్యక్రమాలను ఆనాడు చేపట్టారు. బోధన్ పట్టణంలో జేఏసీ చైర్మన్ గా అప్పటి ప్రధానోపాధ్యాయులు గోపాల్ రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమకారులు తమ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కవితమ్మ జన్మదిన వేడుకల సందర్భంగా ఉద్యమకారుల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా బోధన్ పట్టణంలోని రాకాస్ పేటలో కార్యక్రమం నిర్వహించారు. ఉద్యమకారులకు ప్రభుత్వం గుర్తించి ఆదరించాలని మున్సిపల్ కౌన్సిలర్ తూము శరత్ రెడ్డి కోరారు. ఉద్యమకారులకు సన్మానించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఆనాటి ఉద్యమకారుడు జేఏసీ చైర్మన్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ నాడు ఎటువంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా భావించి బోధనలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించి కేసీఆర్ కు సంఘీభావం ప్రకటించామని తెలిపారు. బోధన్ ప్రాంత ప్రజలు ఎంతోమంది ఉద్యమ సమయంలో ఎన్నో నష్టాలకోరుచుకుని ఎన్నో కేసుల్లో కూడా ఇరుక్కుపోయారని అయినప్పటికీ ఉద్యమంలో ఎవరు వెనకడుగు వేయలేదని గుర్తు చేశారు. తనతోపాటు ఉద్యమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమకారులకు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రాధాన్యత ఇస్తారని ఆశించామని కానీ నేటి వరకు ఉద్యమాకారులకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వకపోవడంపై గోపాల్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉద్యమకారులకు సముచిత న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 9 ఏళ్లలో మమ్ములను ఎవరు పట్టించుకోలేదని కనీసం కవితమ్మ పుట్టినరోజు సందర్భంగా తమను మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో సన్మానించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర నాయకులు అప్పటి ఉద్యమకారుడు, న్యాయవాది శ్యామ్ రావు, మల్లేష్ ముత్తన్న యాదగిరి వారితోపాటు పలువురు ఆనాటి ఉద్యమకారులు మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement