సిరికొండ, సెప్టెంబర్ 12 (ప్రభ న్యూస్): అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న సిరికొండ మండలం పెద్దవాల్గొట్ గ్రామానికి చెందిన శ్రీను పంతులుకు మంగళవారం టీఎస్ ఆర్టీసీ చైర్మెన్, నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ లక్ష రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందించారు. అనంతరం ఎమ్మెల్యే గోవర్ధన్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా అబాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఎమ్మెల్యే చెప్పారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, పెద్దవాల్గొట్ సర్పంచ్ గద్దల దాస్, చింటు, సిరికొండ గ్రామ శాఖ అధ్యక్షుడు దువ్వురి సంతోష్ రెడ్డి, దువ్వురి నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.