Monday, November 25, 2024

NZB: బోగస్ ఓట్లపై.. జిల్లా కలెక్టర్ కు ఎమ్మెల్యే ధన్ పాల్ ఫిర్యాదు

నిజామాబాద్ ప్రతినిధి, ఏప్రిల్ 30(ప్రభ న్యూస్) : నిజామాబాద్ నగరంలో మైనార్టీ ప్రాంతాల్లో ఇళ్ళు లేకున్నా… ఎలాంటి చిరునామా లేకుండా బోగస్ ఓట్లను కొత్తగా జాబితాలో చేర్చి ఇందూరు నగరాన్ని మరో పాతబస్తీగా మార్చేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆరోపించారు.

మంగళవారం నగరంలోని జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కొత్తగా నమోదైన ఓటర్ లిస్టులో ఒకే అడ్రసులపై మైనారిటీల ఓట్లు భారీగా నమోదయ్యాయని తెలిపారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు అర్బన్ ఎమ్మెల్యే తెలిపారు. బోగస్ ఓటర్లను ఓటు వేయకుండా చూడాలని కలెక్టర్ ను కోరినట్లు తెలిపారు. బోగస్ ఓటర్ల విషయమై జిల్లా కలెక్టర్ స్పందించి విచారణ చేపిస్తానని చెప్పినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

అవినీతికి కేరాఫ్ కాంగ్రెస్..
అవినీతికి కేరాఫ్ కాంగ్రెస్ అని అర్బన్ ఎమ్మెల్యే ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కేవలం ఒక వర్గానికి కోసం ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నించాడు. ఇప్పటివరకు ఆరోగ్యానికి స్పష్టత ఇవ్వలేదని.. 420 హామీలు 420 గానే మారాయని ఎద్దేవా చేశారు. ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు 6 గ్యారంటీలు ఎక్కడా అని ప్రజలు నిల‌దీస్తున్నారని తెలిపారు. బీజేపీకి ప్రజ‌ల్లో రోజురోజుకూ వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే బీజేపీ పై కాంగ్రెస్ బురద జల్లుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకు లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement