Wednesday, November 20, 2024

స్వయం సహాయక సంఘాలకు రూ.20లక్షల వరకు రుణాలు..

కామారెడ్డి, జూలై 18 (ప్రభ న్యూస్): అర్హత కలిగిన స్వయం సహాయక సంఘాలకు రూ.20 లక్షల వరకు రుణాలు అందిస్తున్నట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఛైర్మన్ వై.శోభ తెలిపారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వారు మంగళవారం రోటరీ క్లబ్ కామారెడ్డిలో ఏర్పాటు చేసిన మహిళ మహోత్సవ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాలకు రూ.35 కోట్ల రుణాలను కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ వై.శోభ మాట్లాడుతూ… ఆర్థిక క్రమశిక్షణతో అభివృద్ధికి బాటలు వేయవచ్చని, పొదుపు రికవరీ విషయంలో నిర్లక్ష్యం తగదని, ప్రభుత్వం అందించే వడ్డీ రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పంట రుణాలు, డ్వాక్రా రుణాలు, గోల్డ్ లోన్ లతో పాటు గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు విద్య రుణం, వ్యాపార రుణాలు మార్టిగేజ్ లోన్ కూడా అందిస్తున్నామని తెలిపారు. రైతులకు పంట రుణాలతో పాటు ప్రత్యేకంగా రూపొందించిన రైతు నేస్తం రుణాలను, నీటిలో చేపల పెంపకంపై రుణాలు అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ పురం నవీన్, డీఆర్ డీఏ సాయన్న, మెప్మా పీడీ శ్రీధర్ రెడ్డి, కామారెడ్డి ఎల్ డీ ఎం, ఐకెపి డీపీఎం, ఏపీఎంలు, మహిళలు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement